
హాజరుశాతం పెంచడానికే ఎఫ్‌ఆర్‌ఎస్
● డీఐఈవో రవికుమార్
● బోధన్ ప్రభుత్వ జూనియర్
కళాశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
బోధన్‌టౌన్(బోధన్): ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికే ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ఏర్పాటు చేసినట్లు డీఐఈవో రవికుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హాజరు శాతం మెరుగైందని, ఈ సిస్టమ్ ద్వారా విద్యార్థులు కళాశాలకు గైర్హాజరు అయితే తల్లిదండ్రులకు మెసేజ్ వెళుతుందన్నారు. దీంతో ఇటు అధ్యాపకులు, తల్లిదండ్రులు జాగ్రత్త పడతారన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ వెంకటనారాయణ సూచించారు. ఇంటర్ పరీక్ష ఫీజును మినహాయించి, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని డీఐఈవో తెలిపారు. ప్రిన్సిపాల్ నిఖత్ కౌసర్, ఏజీఎం అరింద్ తదితరులు పాల్గొన్నారు.