
ఐలమ్మకు ఘన నివాళి
జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్ గోర్త రాజేందర్, యువజన సభ్యుడు పిండి సదానంద్ యాదవ్, వీడీసీ చైర్మన్ రాజేశ్వర్, అర్గుల్ రజక సంఘ సభ్యులు సాగర్, గంగాధర్, భాస్కర్ పాల్గొన్నారు.
ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు..
అర్గుల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ గోర్త రాజేంధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.