
పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన మహారాష్ట్ర రైతుల
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ముంబై స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని హిగోళి, సాంగ్లీ, నాందేడ్ ప్రాంత రైతులు సందర్శించారు. పరిశోధన వివరాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో పసుపు పంటపై చేస్తున్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, నూతన వంగడాల గురించి ప్రధాన శాస్త్రవేత్త మహేంధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్రం సూపరింటెండెంట్ ముఖేష్, సిబ్బంది శంకర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
3న కిసాన్ మిలాప్
ఆర్మూర్: పెర్కిట్‌లో వచ్చే నెల 3న కిసాన్ మిలాప్ పేరుతో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో ఏడాది నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాన్ని పెర్కిట్ శివారులోని నిర్మల్ రోడ్డులో గల కామాక్షి కన్వెన్షన్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నిజామాబాద్ నాగారం: నగరంలో శుక్రవారం భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా బీఎంఎస్ అధ్యక్షుడిగా సాయరెడ్డి , ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ చారి, కోశాధికారిగా అంకుష్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర స్వామికుమార్, బీడీ కార్మిక సంఘ్ జాతీయ అధ్యక్షులు సుధీర్ పాల్గొన్నారు.
నవీపేట: మండలంలోని యంచ వద్ద గల గో దావరిలో ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని త హసీల్దార్ వెంకటరమణ శుక్రవారం కాపాడా రు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా గ్రామానికి చెందిన మహేష్ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బయటకు వెళ్లాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు యంచ గోదావరి బ్రిడ్జిపైకి వచ్చాడు. నదిలో దూకేందుకు యత్నించగా అటువైపు వెళ్లిన తహసీల్దార్ వెంకటరమణ బాధితుడిని కాపాడారు. అనంతరం అతడిని ఎస్సై తిరుపతి దగ్గరకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇప్పించారు.

పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన మహారాష్ట్ర రైతుల