ఆగమాగం.. ఫైళ్లు మాయం | - | Sakshi
Sakshi News home page

ఆగమాగం.. ఫైళ్లు మాయం

Sep 26 2025 7:22 AM | Updated on Sep 26 2025 2:23 PM

నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పరిస్థితి

స్లాట్‌ సమయం ఉదయం ఉన్నా.. సాయంత్రం వరకు ఆగాల్సిందే..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అది నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం.. కొత్తవారు ఎవరైనా వస్తే చేపల మార్కెట్టా.. లేక కొత్త సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారా..? అనే సందేహం కలుగక మానదు. ఇదే తరహా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ తొమ్మిది నెలల నిండు గర్భిణి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం రాగా, ఉదయం 11 గంటలకు స్లాట్‌ ఇ చ్చారు. సాయంత్రం 6.30 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. విచిత్రమేమిటంటే కంప్యూటర్‌ గదిలో ఎంట్రీ చేసే సిస్టమ్‌ వద్ద ఉన్న ఫైల్‌ మాయమైంది. కొన్ని గంటల పాటు వెతకగా చివరకు హాల్‌లో ఉన్న టేబుల్‌ మీద ఈ ఫైల్‌ దొరికింది. కార్యాలయంలో ఏ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అనేది అర్థం కాని పరిస్థితి. నిండు గర్భిణి రిజిస్ట్రేషన్‌ నిమి త్తం బుధవారం కూడా రోజంతా అనేక ఇబ్బందు లు కలిగినప్పటికీ వేచి చూసి వెళ్లారు. ఇలా రిజి స్ట్రేషన్‌ కోసం రెండ్రోజులుగా తిరుగుతున్నవారు చాలామంది ఉన్నారు.

డాక్యుమెంట్‌ రైటర్ల పోటాపోటీ వ్యవహారంలో ఎవరి ఫైళ్లు వారు ముందు పెట్టుకోవాలనే పోట్లాడే పరిస్థితి నెలకొంది. కార్యాలయం మొత్తం డాక్యు మెంట్‌ రైటర్లదే హవా. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్లు ముందుకు రావడం లేదు. ఏడాది కాలంగా ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు ఇన్‌చార్జి ఇచ్చారు. ఈ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. అయితే ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న రోజు కార్యాలయంలో రిజి స్ట్రార్‌ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు రోజంతా వేచిచూడాల్సిన వచ్చింది. అంతకు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్‌ పనిచేయలేదంటూ రిజి స్ట్రేషన్లు పూర్తి చేయలేదు. వందల మందికి ఎదురు చూ పులు తప్పలేదు. అ యితే నిజామాబాద్‌ రూరల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మాత్రం సర్వర్‌ పనిచేయడం గమనార్హం. నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే.

అద్దె భవనంలోనే..

అత్యధిక ఆదాయం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి సొంత కార్యాలయం ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేసి అందులోకి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. ఇలా తరలివెళ్లిన కార్యాలయాలకు సంబంధించి పలుచోట్ల పాత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ భారీగా అద్దెలు చెల్లిస్తూ తగిన సౌకర్యాలు లేని ప్రైవేటు భవనంలో నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ కార్యాలయాలు నడిపిస్తున్నారు. రెండో ఫ్లోర్‌లో ఉన్న అర్బన్‌ కార్యాలయానికి వచ్చేందుకు గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీలు లేక గంటల తరబడి నిలబడుతున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కూడా సక్రమంగా లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా పరిశీలించి తగిన విధంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.

ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌

ఖలీల్‌వాడి: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ టి.జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి రోజూ జేబీఎస్‌ నుంచి నిజామాబాద్‌ వరకు 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు, అలాగే తిరుగు ప్రయాణికులు 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఆర్‌ఎం తెలిపారు. రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోలు నిజామాబాద్‌ – 1,2, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డికి జెబీఎస్‌ నుంచి బస్సులు న డుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఇతర ప్రఽ దాన రూట్లలో సైతం అదనపు బస్సులు న డుస్తాయని, www.tg srtcbus.in వెబ్‌సైట్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు కళాశాలల్లో టీచర్స్‌, పేరెంట్స్‌ మీటింగ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ బోర్డ్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు నిర్వహించనున్న సమావేశాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. అధ్యాపకులు నేర్పాల్సిన అంశాలను, సమస్యలను తల్లిదండ్రులు తెలుపాలని డీఐఈవో కోరారు. విద్యార్థుల హాజరు, విద్యాభ్యాసం, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల మార్కులను ఈ సమావేశంలో తల్లిదండ్రులకు వివరిస్తామని, తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు.

నిజామాబాద్‌1
1/2

నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

నిజామాబాద్‌2
2/2

నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement