
వైన్‌షాపులకు నేటి నుంచి దరఖాస్తులు
ఖలీల్‌వాడి : వైన్‌షాపుల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మే రకు ఎకై ్సజ్ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కే టాయించి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 న వంబర్ 30 కాలానికి లైసెన్స్‌లు కేటాయిస్తారు. ప్రస్తుతమున్న వైన్‌షాపులు నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను ఖరారు చేస్తామని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు.
జిల్లాలో 102 వైన్‌షాపులున్నాయి. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రూ.3 లక్షల డీడీ చెల్లించి దరఖాస్తు ఫారం పొందాల్సి ఉంటుంది. ఆరు శ్లా బుల్లో జనాభా ప్రాతిపదికన మ ద్యం షాపుల లైసెన్స్ ఫీజు ఉండనుంది. 2023 లో 102 దుకా ణాలకు మొత్తం 4 వేల దర ఖాస్తులు రాగా, ఈ సారి 5 వేల వరకు వస్తాయ ని ఎకై ్సజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జనాభా లైసెన్స్ ఫీజు
(రూ.లక్షల్లో)
5 వేల వరకు 50
5 వేల నుంచి 50 వేలు 55
50వేల నుంచి లక్ష వరకు 60
లక్ష నుంచి 5 లక్షల వరకు 65
5 లక్షల నుంచి 20 లక్షల వరకు 85
జిల్లాలో 102 మద్యం షాపులు
దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
లాటరీ ద్వారా దుకాణాల
కేటాయింపు
2023లో 4 వేల దరఖాస్తులు