
ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి
జక్రాన్‌పల్లి: మండలంలోని మనోహరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జేఏంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు గురువారం సందర్శించారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తమిళసేలివి, ప్రియాంక, రాజశేఖర్ పరిశ్రమను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ సీనియర్ ఆఫీసర్ ప్రశాంత్, పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పాట్కురి తిరుపతిరెడ్డి క్లస్టర్ గురించి శాస్త్రవేత్తలకు వివరించారు. రైతులు సంఘటితంగా ఉండి ఆధునిక పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, పుప్పాల నాగేశ్, సూపర్‌వైజర్ రుత్విక్ తదితరులు పాల్గొన్నారు.