
చెదరని చరిత్ర
● ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక
ఎస్సారెస్పీ
నిజాంసాగర్ ప్రాజెక్టు
డొంకేశ్వర్(ఆర్మూర్)/ఇందల్వాయి : ఇంజినీర్లే లేని కాలంలో నిర్మించిన భవనాలు, ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కేవలం రాళ్లు, డంగు సునాన్ని మాత్రమే ఉపయోగించడం ప్రత్యేకత.
200 ఏళ్ల నాటి రామలింగేశ్వరాలయం
కుస్తాపురం రామ లింగేశ్వర ఆలయాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. గుడిని పూర్తిగా రాతితో నిర్మించారు. 1965 సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కట్టడంతో కుస్తాపురం గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆలయం కొన్నేళ్లుగా బ్యాక్ వాటర్ ముంపులోనే ఉంటోంది. రెండు సార్లు తేలినా గుడి చెక్కు చెదరకుండా ఉంది.
సిర్నాపల్లిలో గడి..
సిర్నాపల్లి సంస్థానాధీశురాలు జానకీబాయి అధికారిక భవనాన్ని(గడి) 1870వ దశకంలో అ ద్భుతంగా నిర్మించారు. ఇటుక, మట్టి గోడలు, డంగు సున్నంతో చేపట్టిన నిర్మాణం 150 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదు. గడి ఎండాకాలంలో చల్లగా, శీతాకాలం వెచ్చగా ఉంటుంది.
మూడంచెల తూము
ఇందల్వాయి: అద్భుతమైన ఇంజినీరింగ్‌కు సిర్నాపల్లి జానకీబాయి చెరువుతూము అద్దం పడుతోంది. మూడు అంచెలుగా నిర్మించిన తూము ద్వారా కింది ప్రాంతంలో ఉన్న చెరువులకు నీటిని వదులుతారు. చెరువులో నీటి మ ట్టాన్ని బట్టి ఒక్కో తూమును తెరుస్తారు. కేవ లం బండ రాళ్లతో నిర్మించిన తూము ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చెరువులో చివరి నీటి బొట్టు వరకు ఉపయోగించే విధంగా తూమును నిర్మించారు.
నాటి ఇంజినీర్ల నైపుణ్యం, అంకితభావానికి ల్యాండ్ మార్క్‌గా నిలుస్తున్నాయి ఉమ్మడి జిల్లాలోని కట్టడాలు. రాళ్లు, డంగు సున్నంతో నిర్మించిన ప్రాజెక్టులు భారీ వరదలను తట్టుకుని చరిత్రలో నిలిచి ఉన్నాయి. నిజాం పాలనలో నాటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ ఉమ్మడి జిల్లాలో రూపకల్పన చేసిన నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులతోపాటు అలీసాగర్ రిజర్వాయర్‌లు ఆయకట్టుకు జీవం పోస్తున్నాయి. చెరువులో ఏ స్థాయిలో నీరున్నా ఆయకట్టుకు నీరందించేలా శీలం జానకీబాయి సిర్నాపల్లి చెరువులో నిర్మింపజేసిన మూడంచెల తూము ‘ఔరా’ అనిపిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక కట్టడాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంజినీర్స్‌డే సందర్భంగా ‘సాక్షి’ కథనం..
ఇరవైఏళ్ల ఇంజినీర్ల శ్రమ
బాల్కొండ: ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 1963 జూలైలో పనులు ప్రారంభం కాగా 1983లో పూర్తయ్యింది. ఇరవై సంవత్సరాలపాటు ఇంజినీర్ల చేసిన కృషి 62 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరకుండా నిలబడింది. మిగులు జ లాలను గోదావరిలోకి విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరద గేట్లు ఎస్సారెస్పీకే ప్రత్యేక ఆకర్షణ.
18 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి, చేపల పెంపకం లక్ష్యాలుగా.. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంలో నిర్మించారు. వరద తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండరాయి ప్రాంతాన్ని ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంచుకున్నారు. 16 లక్షల క్యూసెక్కుల వ రద నీటిని తట్టుకునేలా ఆనాటి ఇంజినీర్లు డిజైన్ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను ని ర్మించారు. పూడిక పోయేలా ఆరు రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు.
డంగు సున్నం, బండ రాళ్లు..
ఎస్సారెస్పీ నిర్మాణంలో అధికంగా డంగు సున్నం, బండరాళ్లను వినియోగించినట్లు ఇంజినీర్లు తెలుపుతున్నారు. కుడి, ఎడమల 14 కిలోమీటర్ల మేర ఆ నకట్ట నిర్మించారు. ఆనకట్టకు రివిట్ మెంట్ నిర్మా ణం కోసం పెద్దపెద్ద రాళ్లను వినియోగించారు.
ఉమ్మడి జిల్లాలో భారీ ప్రాజెక్టులు రాళ్లు, డంగు సున్నంతో నిర్మాణం భారీ వరదలను తట్టుకుని నిలబడుతున్న కట్టడాలు
గడీలు, ఆలయాలు ఎన్నో అద్భుత కట్టడాలు నేడు ఇంజినీర్స్ డే
రాతి కట్టడాలు..

చెదరని చరిత్ర

చెదరని చరిత్ర

చెదరని చరిత్ర

చెదరని చరిత్ర

చెదరని చరిత్ర