
ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్‌లోని 23 వరద గేట్ల ద్వారా 90 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శనివారం ఉదయం ప్రాజెక్ట్‌లోకి 90 వేల క్యూసెక్కులకు వరద నీరు తగ్గిపోవడంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 75 వేల క్యూసెక్కులకు నీటి తగ్గించారు. మధ్యాహ్ననికి లక్షా 32 వేల క్యూసెక్కులకు పెరగడంతో గోదావరిలోకి లక్షా 15 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. రాత్రి వరకు అంతేస్థాయిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. కాగా శనివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉంది.
సందర్శించిన హైకోర్టు జడ్జీలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను శనివారం హైకోర్టు జడ్జీలు సామ్ కోషి, సృజన సందర్శించారు. నిర్మల్ జిల్లా పర్యటనను ముగించుకుని వారు తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జడ్జీలకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సారెస్పీ అతిథి గృహంలో జడ్జిలు, కలెక్టర్‌తో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చించారు.
వరల్డ్ బాక్సింగ్ కమిటీలో
నిఖత్ జరీన్‌కు చోటు
నిజామాబాద్‌నాగారం: వరల్డ్ బాక్సింగ్ అథ్లెటిక్ కమిటీలో జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు చోటు లభించింది. కమిటీలో టర్కీ, ఆస్ట్రేలియా, వేల్స్, యూఎస్‌ఏ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులతోపాటు భారత్ తరఫున నిఖత్‌కు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు.
రికార్డుల నిర్వహణపై డీఎంహెచ్‌వో ఆగ్రహం
బాల్కొండ: రికార్డుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్న బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. అనంతరం మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య సేవలను మె రుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యవిధాన పరిష త్ నుంచి వైద్యుల కొరత ఉందని, దీంతో జి ల్లా వైద్య శాఖ నుంచి మరో ఇద్దరు వై ద్యు లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు ఇక్కడ సేవలందిస్తారని తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నానో యూరియా వాడకం పెరిగేలా చూడాలి
● జిల్లా వ్యవసాయాధికారి గోవింద్
డిచ్‌పల్లి: రైతులు పంటల సాగుకు నానో యూరియా వాడకాన్ని అలవాటు చేసుకోలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ సూచించారు. శనివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. యూరియా నిల్వలపై సమీక్షించారు. భవిష్యత్‌లో నానో యూరియా వాడకం పెంచా లని, ఈ విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తు తం సొసైటీ పరిధిలో యూరియా కొరత లేదని చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఆయన వెంట సొసైటీ సీఈవో నారాయణరెడ్డి, సిబ్బంది ఉన్నారు.

ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద

ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద

ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద