
త్వరలోనే ఇందూరుకు వందే భారత్
● జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
● ఎన్‌సీసీఐ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నిజామాబాద్ రూరల్: త్వరలోనే ఇందూరు నుంచి ముంబై, మధ్యప్రదేశ్‌లకు వందేభారత్ రైలు సౌ కర్యం కల్పించనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో శనివారం నిర్వహించిన నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండసీ్ట్ర (ఎన్‌సీసీఐ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయ త్నాలు కొనసాగుతున్నాయన్నారు. వందేభారత్ రై లుకు సంబంధించిన ఫైలు రైల్వే శాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రైల్వే బ్రిడ్జిలు, కొత్త రైల్వేలైన్ నిర్మాణాల ఆలస్యానికి గత ప్రభుత్వ పాలకుల అవినీతి, అక్రమాలే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. అనంతరం ఎన్‌సీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రాజు, శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.