
ఆలయంలో చోరీ
మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండాలోగల వీర హనుమాన్ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తండావాసులు తెలిపారు. ఆలయం తాళాలను పగులగొట్టి, ఆలయంలోని బీరువాలో ఉన్న అరకిలో వెండి కిరీటంతోపాటు చేతిలో ఉన్న గధను అపహరించుకపోయారు. అంతేకాకుండా ఆలయంలో పసుపు, కుంకుమ కలిపి వండిన అన్నం ఉండటంతో తండాకు ఏదైన కీడు జరగాలని దుండగులు ఇలా చేసి ఉంటారేమోనని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ మూడ గోవింద్‌నాయక్ మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.