
మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలి
బోధన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు, విద్యుత్ లైన్లకు మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూర మండలంలోని సాలూర క్యాంప్‌లో శనివారం ఆయన మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో వరదలతో జరిగిన నష్టాలపై, పునరుద్ధరణ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల రైతులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యాలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పంట నష్టం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, అధికారులు ముక్తార్, వెంకటేశ్వర్లు, మున్నినాయక్, శశిభూషణ్, శ్రీనివాస్, శ్వేత, నాయకులు మొబిన్‌ఖాన్, మందర్నా రవి, నాగేశ్వర్‌రావు, పులి శ్రీనివాస్, నాయకులు అల్లె రమేష్, చిద్రపు అశోక్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి