
ముత్యాల చెరువు పరిశీలన
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్ అటవీ ప్రాంతంలోగల ముత్యాల చెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో ఆ ప్రదేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం బీరప్ప తండాలో నష్టపోయిన పంటలను, ఇళ్లను, రోడ్లను పరిశీలించారు. బీరప్పతండాకు అదన కలెక్టర్ వచ్చి న విషయాన్ని తెలుసుకున్న వాడి, హోన్నాజీపేట్ ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. ముత్యాల చెరువు కట్ట నిర్మాణం మళ్లీ చేపడితే తమ గ్రామాలు మళ్లీ ముంపునకు గురవుతాయని ప్రజలు అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో కట్ట నిర్మా ణం చేపట్టవద్దని ఆందోళన చేపట్టారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులను వివరిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఆర్డీవో వినోద్, ఇరిగేషన్ ఎస్‌ఈ రామారావు, ఈఈ నరేందర్, డీఈ ప్రేమ్ కుమార్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.