
ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు
నిజామాబాద్‌నాగారం: నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో బాలుర, బాలికల క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి ఉమ్మడి జిల్లా తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తుది జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 12 నుంచి 14 వరకు జనగాం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా అధ్యక్షుడు మానస గణేష్, కార్యదర్శి శ్యామ్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, కార్యవర్గం సభ్యులు భాగ్యశ్రీ,, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తిక్, జిల్లా వ్యాయమ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న బీఈడీ, ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో మొత్తం 279 మంది విద్యార్థులకు గానూ 261 మంది హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఎంఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్, 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో ఒక విద్యార్థి హాజరైనట్లు ఆయన తెలిపారు.
నిండుకుండలా ఎస్సారెస్పీ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పూర్తిస్థా యి నీటినిల్వకు అధికారులు పెంచారు. ప్రస్తు తం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 27వేల 650 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది.
ఆర్మూర్: మలేషియా దే శంలోని కౌలాలంపూర్ లో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా సంబురాలకు హాజరుకావాలని ఆర్మూర్‌కు చెందిన నటరాజ నృత్య నికేతన్ నాట్య గురువు బాశెట్టి మృణాళినికి శని వారం ఆహ్వానం అందింది. తమ విద్యార్థులతోపాటు వారు హాజరై గౌరవ ప్రదమైన సన్మానాన్ని పొందాలని యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ తరఫున ఆహ్వానించినట్లు నిర్వాహకులు దేవులపల్లి పవన్ వివరించారు. ఈ ఆహ్వానంతో శిక్షణ పొందుతున్న చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు