నత్తనడకన ఆర్‌యూబీ పనులు | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన ఆర్‌యూబీ పనులు

Sep 7 2025 7:11 AM | Updated on Sep 7 2025 7:11 AM

నత్తన

నత్తనడకన ఆర్‌యూబీ పనులు

వేగవంతం చేయాలి..

తిరిగి వెళ్లాల్సి వస్తోంది

నవీపేట మండలంలో మూడు చోట్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు

పనుల్లో కనిపించని పురోగతి

నవీపేట: రైల్వే సేవల విస్తరణలో భాగంగా రైల్వే శాఖ ఇటీవల పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా నవీపేట మండల పరిధిలో రైలు పట్టాల పెంపు, అవసరమైన చోట ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ బ్రిడ్జి) పనులను నాలు గు నెలల కిందట ప్రారంభించింది. రైల్వేట్రా క్‌ (బ్రాడ్‌గేజ్‌) లైన్‌ విస్తరణలో భాగంగా రైల్వేగేట్‌లను తొలగించాలని నిర్ణయం తీసుకుని ముందడుగు వేసింది. కానీ పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రైల్వే గేట్ల ఇబ్బందులు తొలగించడానికి..

మండలంలోని ధర్యాపూర్‌, మహంతం, ధర్మారం(ఏ),నాగేపూర్‌, ఫకీరాబాద్‌, మిట్టాపూర్‌ గ్రామాల లో రైల్వేగేట్‌లు ఉన్నాయి. రైలు వస్తున్న సమయంలో ఈ గేట్లు వేయడంతో ప్రయాణికుల రాకపోకల కు ఇబ్బంది అవుతుంది. నవీపేట, రెంజల్‌, నంది పేట, ఎడపల్లి, నిజామాబాద్‌ సరిహద్దు గ్రామాలకు చెందిన వేలమంది ప్రయాణికులు ఈ రహదారుల వెంబడి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను తప్పించాలనే నేపథ్యంలో రైల్వేశాఖ ఆర్‌యూబీ పనులకు శ్రీకారం చుట్టింది.

రూ.15 కోట్ల నిధులు..

మొదట ధర్యాపూర్‌, మహంతం, ధర్మారం(ఏ) గ్రామాలలోని రైల్వేగేట్లను తొలగించాలనే లక్ష్యంతో ఈ మూడు ప్రాంతాలలో ఆర్‌యూబీ పనులను ప్రారంభించింది. రూ. 5 కోట్ల చొప్పున మూడు ఆర్‌యూబీ పనులకు మొత్తం రూ. 15 కోట్లు నిధులను ఆరు నెలల కిందట కేటాయించారు. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభ మయ్యాయి. కానీ పనులలో వేగం పుంజుకోవడం లేదు. ధర్మారం(ఏ) వద్ద ఒకవైపు తవ్వి వదిలేయగా అందులో పూర్తిగా వర్షపు నీరు నిలిచింది. మహంతం ప్రాంతంలో ఒక వైపు పనులను ప్రారంభించినా మందకొడిగా సాగుతోంది. ధర్యాపూర్‌లో ఒక వైపు మొరం తవ్వి పనులు చేస్తున్నారు. మరోవైపు కొద్దిమేర సీసీ వేసి వదిలేశారు. రైల్వే అధికారుల అజమాయిషీ కరువవ్వడంతో సంబంధిత గుత్తేదారులు ఇష్టానుసారం పనులు నిర్వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా ఎలాంటి పురోగతి కనపించడం లేదు. పనులు చేపట్టడంతో సంతోషపడిన చుట్టు పక్కల గ్రామాల వాసులు పనులు మందకొడిగా సాగడంతో ఇబ్బంది పడుతున్నారు. తాత్కలికంగా గేట్లు మూసివేయడంతో దూరభారం పెరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మా గ్రామం నుంచి నవీపేట, నిజామాబాద్‌లకు వెళ్లాలంటే మహంతం రైల్వే గేటు మీదుగా వెళ్తాం. ప్రస్తుతం రైల్వే గేటును ఆర్‌యూబీ పనుల నిమిత్తం మూసి వేశారు. దీంతో కమలాపూర్‌ మీదుగా తిరిగి వెళ్తున్నాం. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి ఆర్వోబీ పనులను వేగంగా నిర్వహిస్తే బాగుంటుంది.

–సతీష్‌, మహంతం

రాంపూర్‌లో బీడీ కార్కానా నడిపిస్తాను. వృత్తిరీత్య ప్రతిరోజు రాంపూర్‌ నుంచి పోతంగల్‌కు ధర్యాపూర్‌ గేటు మీదుగా రాకపోకలు సాగిస్తాను. కొన్ని నెలలుగా గేటును మూసివేశారు. రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ మీదుగా పోతంగల్‌కు వెళ్లాల్సి వస్తుంది. అండర్‌ గ్రౌండ్‌ మార్గాన్ని నిర్మిస్తున్నారని సంతోషపడ్డాం. కానీ పనులను ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. –బైండ్ల శ్యామ్‌, రాంపూర్‌

నత్తనడకన ఆర్‌యూబీ పనులు 1
1/2

నత్తనడకన ఆర్‌యూబీ పనులు

నత్తనడకన ఆర్‌యూబీ పనులు 2
2/2

నత్తనడకన ఆర్‌యూబీ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement