
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● మరో ఇద్దరికి గాయాలు
బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. ని ర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్‌కు చెందిన సాస్కిన్ అభినాష్(25) శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై తన బంధువుల పిల్లలైన రుసునకంటే గణేష్, ఆంబ్లే లోకేష్‌లతో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో చేపలు వేటాడడానికి వచ్చారు. వేట ముగిసిన తర్వాత అర్ధరాత్రి వేళ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. పోచంపాడ్ చౌరస్తాలోగల హైవేపై వీరి బైక్‌ను ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ఘటనలో బైక్‌పై మధ్యలో కుర్చున్న అభినాష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా నిర్మల్‌జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మంజీర బ్రిడ్జికి వేలాడిన మృతదేహం
బోధన్‌రూరల్: మంజీర నది బ్రిడ్జికి శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కలకలం రేపింది. అటువైపుగా వెళ్లిన కొందరు ప్రయాణికులు మృతదేహాన్ని గమనించి బోధన్ రూరల్ పోలీసులు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, పరిసరాలను పరిశీలించారు. ఘటన స్థలం మహారాష్ట్ర పరిధిలోకి రావడంతో మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు.
స్వగ్రామం చేరిన అన్వేష్‌రెడ్డి మృతదేహం
బాల్కొండ: మెండోరా మండల కేంద్రానికి చెందిన సామ అన్వేష్‌రెడ్డి(30) పది రోజుల క్రితం గుండెపోటుతో ఐర్లాండ్‌లో మృతి చెందాడు. ఆయన మృతదేహం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యుల రోధనలు మధ్యే అంత్యక్రియలను నిర్వహించారు. అన్వేష్‌రెడ్డి నాలుగు నెలల క్రితమే సెలవుపై వచ్చి వివాహం చేసుకుని ఇటీవల వెళ్లాడు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్