
అవినీతికి కేరాఫ్‌గా బల్దియా
అవినీతికి పరాకాష్ట.. కీలక అధికారి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బల్దియా అంటేనే అవినీతికి కేరాఫ్‌గా మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యే ధన్‌పాల్ ధన్‌పా ల్ సూర్యనారాయణ గుప్తా బహిరంగంగానే పలుమార్లు ఈ విషయం చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను బదిలీ చేయించేందుకు కొందరు అవినీతిపరు లైన ఉద్యోగులు, అధికారులు చేసిన కుట్రలు చూసి అధికార పార్టీ నేతలైన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డిలు సైతం ఆశ్చర్యపోవడం గమనార్హం. దీన్ని బట్టే చూస్తే బల్దియాలో ఉద్యోగులు చేస్తున్న అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. బల్దియా చరిత్రలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఏసీబీ దాడులు జరిగాయి. 2024 ఆగస్టు 9న ఆర్‌వో దాసరి నరేందర్ రూ.3 కోట్ల నగదుతో పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆర్‌ఐ శ్రీనివాసరావు ఆర్మీ జవాన్ నుంచి రూ.7వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ఫైలుకో రేటు..
బల్దియాలో పైసలిస్తేనే ఫైళ్లు కదిలే పరిస్థితి. ప్రభు త్వ ఫీజులు చెల్లించినప్పటికీ అనుమతులు ఇవ్వడం లేదు. నెలల తరబడి తిప్పుతున్నారు. బోర్గాం(పి) కు చెందిన ఓ వ్యక్తి తన పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని కట్టుకోవడానికి అనుమతి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాడు. చివరికి ఫైలు కనిపించ డంలేదని తెలిపారు. అయితే ముడుపులు ఇవ్వగానే రెండు రోజుల్లో అనుమతి పత్రం చేతిలో పెట్టారు. నగరంలోని కవిత కాంప్లెక్స్‌లో ఓ దుకాణదారుడు పన్ను చెల్లిస్తానని ముందుకు వచ్చినప్పటికీ ఆయనను ముప్పుతిప్పలు పెట్టడం గమనార్హం. కొలత లు సరిగా లేవని, కొత్త మెజర్‌మెంట్స్ తీసుకోవాల ని, సైట్ పనిచేయడం లేదంటూ పలు కారణాలు చె బుతూ ఆరు నెలలు తిప్పారు. చివరకు సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఒకరిని కలిసి ముడుపులు ఇవ్వ డంతో రెండు రోజుల్లో పని పూర్తి చేశారు. ఇటీవల వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అసెస్‌మెంట్ కో సం వెళ్తే తిప్పి తిప్పి, చివరకు రూ.30 వేలు తీసు కుని అనుమతి ఇచ్చారు. ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ తాజా మాజీ కార్పొరేటర్‌కు సంబంధించిన సొంత పనిని కూడా చేయకుండా నెలల తరబ డి తిప్పుతున్నారు. కార్పొరేటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టి న సందర్భాలు కోకొల్లలు.
60 డివిజన్లకుగాను 60 మంది వార్డు ఆఫీసర్లను ని యమించి వారికి రెవెన్యూ బాధ్యతలు అప్పగించా రు. పన్ను వసూలు చేయడం, ట్రేడ్ లైసెన్సులు లేనివారికి కొత్తగా లైసెన్సులు ఇప్పించడం, పాతవాటి ని రెన్యువల్ చేయించడంతో పాటు పలు పనులు అప్పగించారు. అయితే వీరిలో కొందరు లంచగొండులుగా మారారు. ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందా యి. ముఖ్యంగా నాగారం, అర్సపల్లి, సారంగాపూ ర్ వంటి అటవీ భూములున్న చోట, పేదలున్న డివిజన్లలో వార్డు ఆఫీసర్లు డబ్బులు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. వార్డు ఆఫీసర్లలో కొందరు బిల్ కలెక్టర్లు కూడా ఉన్నారు.
రెండేళ్ల క్రితం ఇక్కడే విధులు నిర్వహించి అప్పటి మేయర్ భర్తతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయిన ఓ కీలక అధికారి, మళ్లీ ఇక్కడికి వ చ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించాడు. ఎ ట్టకేలకు మళ్లీ బదిలీపై వచ్చాడు. తనకు నచ్చిన విభాగానికి వచ్చేందుకు సదరు స్థానంలో ఉన్న మరో అధికారిని బదిలీ చేయించినట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధికారి పెండింగ్ ఫైళ్లు తెప్పించుకుని ముడుపులు తీసుకుని క్లియర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పదిరోజుల్లో వందల సంఖ్యలో ఫైళ్లను క్లియర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆర్‌ఐగా ఉన్న శ్రీనివాస్‌రావును తన ఏజెంట్‌గా నియమించుకుని మరీ డబ్బులు వసూలు చేసినట్లు బల్దియా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరు వచ్చి తనను కలిసినా, ముందుగా ఆర్‌ఐ శ్రీనివాస్‌ను కలిసిన తర్వాతే ఇక్కడికి రావాలనే నిబంధన పెట్టాడు. ఈ వసూళ్ల అధికారిని ఏసీబీకి పట్టించేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అయితే ఇతని తరుఫున లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీనివాస్, సదరు అధికారి పేరు చెప్పినప్పటికీ ఏసీబీ అధికారులు చివరి నిమిషంలో సదరు అధికారి పేరు తొలగించడం గమనార్హం.
ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు
రెవెన్యూ, టీపీవో సిబ్బందిపై
తీవ్ర ఆరోపణలు
పదేళ్లుగా ఒకే విభాగం నుంచి
కదలని సిబ్బంది.. భారీగా
పెండింగ్ ఫైళ్లు
ఏకంగా కార్యాలయంలోనే
డబ్బులు తీసుకుంటున్న వైనం

అవినీతికి కేరాఫ్‌గా బల్దియా