
అసలు నష్టం ఎంత!
బాధిత రైతులు 24,778 మంది..
డొంకేశ్వర్(ఆర్మూర్) : భారీ వర్షాల కారణంగా జి ల్లాలో 48,429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వే సింది. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టి ముంపున కు గురైన పంటలు బయటకు తేలడంతో తుది నివేదికను వ్యవసాయశాఖ రూపొందిస్తోంది. అసలు న ష్టం ఎంత అని తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులు రైతు వారీగా సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. 33శాతానికి మించి పంటలు నష్టపోయి న రైతుల నుంచి ఆధార్, పట్టాపాస్ పుస్తకం, బ్యాంకు ఖాతాల జిరాక్స్ కాపీలను తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతానికి మించి పంట నష్టం జరిగిన రైతులకే పరిహారం అందే అవకాశాలున్నాయి. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి తు ది జాబితాను కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి వ్య వసాయ శాఖ పంపనుంది.
33 శాతానికి మించి దెబ్బతిన్న పంటలను గుర్తిస్తున్నాం. పంట, రైతు పే రు, తదితర వివరాలను సేకరించి తుది నివేదికను రెండు రోజుల్లో తయారు చేస్తాం. కలెక్టర్ అనుమతి తో ప్రభుత్వానికి పంపుతాం. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి
భారీ వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగడంతో పాటు వరద నీరు పోటెత్తి ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ప్రాంతాల్లోని పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. బోధన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్ నియోజకవర్గాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతోపాటు నీటికి కొట్టుకుపోయి ధ్వంసమయ్యాయి. అత్యధికంగా వరికి నష్టం వాటిల్లగా సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలోని 183 గ్రామాల్లో ఈ పంట నష్టం జరుగగా, 24,778మంది రైతులు బాధితులుగా ఉన్నారు.
పంటనష్టంపై తుది నివేదిక
రూపొందిస్తున్న వ్యవసాయ శాఖ
రైతు వారీగా వివరాలు సేకరిస్తున్న
క్షేత్రస్థాయి సిబ్బంది
ప్రాథమిక అంచనా ప్రకారం
48,429 ఎకరాల్లో నష్టం..
33 శాతానికి మించి నష్టపోయిన
రైతులకే పరిహారం!