
రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిఏడాది ప్రకటించే రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సీహెచ్ శంకర్ (ప్రిన్సిపాల్ కేటగిరి), కంజర్ జెడ్పీహెచ్‌ఎస్ గణితం ఉపాధ్యాయు డు రాఘవపురం గోపాలకృష్ణ (ఉపాధ్యాయుల కేటగిరి)ఎంపికయ్యారు. మొత్తం 9 అంశాల్లో ఉపాధ్యాయుల రెండేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శు క్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.
బోధనోపకరణాలతో..
బోధన్‌కు చెందిన రాఘవపురం గోపాలకృష్ణ పేద కుటుంబంలో పుట్టాడు. పేపర్ వేస్తూ, పాల ప్యాకె ట్లు పంచుతూ, హోటల్‌లో, మేసీ్త్రగా పని చేసుకుంటూనే కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు. 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సా ధించిన ఆయన నిజాంసాగర్ మండలంలోని తుర్కపల్లిలో మొదట పోస్టింగ్‌లో చేరారు. ఆ తర్వాత 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. కళా ఆధారిత విద్యను ప్రోత్సహించ డం, బోధనోపకరణాలు తయారు చేయడం, పని చేసే పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనం.
నిజాయితీ, నిబద్ధత శంకర్ సొంతం..
ఎక్కడ పని చేసినా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కు ఆయన పెట్టింది పేరు శంకర్. పని చేసిన చోట గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తోటి ఉపాధ్యాయులతో సమన్వయం, సహకారంతో 1000 మందికిపై గా విద్యార్థులు ఉన్న బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పా ఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నారు. 1997 లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా టీచర్లు
ప్రిన్సిపాల్ కేటగిరిలో బోర్గాం(పీ)
జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం శంకర్
ఉపాధ్యాయుల కేటగిరిలో కంజర్ జెడ్పీహెచ్‌ఎస్ గణితం టీచర్
గోపాలకృష్ణ

రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక