బాధితులను ఆదుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాధితులను ఆదుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం

Sep 2 2025 6:48 AM | Updated on Sep 2 2025 6:48 AM

బాధితులను ఆదుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం

బాధితులను ఆదుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం

మోర్తాడ్‌/ధర్పల్లి/సిరికొండ : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయినవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ ఆ రోపించారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్‌ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. దె బ్బతిన్న పంటలు, ఇళ్లు, రోడ్లు, వాగు వంతెనలను పరిశీలించి వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి నివేదికలు తయారు చేస్తోందని విమర్శించారు. నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయకుండా బాధితులకు ఏ విధంగా పరిహారాన్ని చెల్లిస్తారని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పొలా ల్లోని ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే కేంద్రం ద్వారా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరిస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరి నీ వదిలిపెట్టవద్దని, కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజే పీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులచారి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డా.మల్లికార్జున్‌ రెడ్డి, ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు మహిపాల్‌ యాదవ్‌, సంజీవ్‌రెడ్డి, ఆరె రవీందర్‌, నాయకులు నక్క రాజేశ్వర్‌, అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, కర్క గంగారెడ్డి, గంగాదాస్‌, చిలుక మహేశ్‌, నల్ల పెంటయ్య, రాజశేఖర్‌, నరేశ్‌, సాయాగౌడ్‌, రంజిత్‌రెడ్డి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలి

సీఎంని కలిసి నష్టాన్ని వివరిస్తా..

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్‌

మండలాల్లో పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement