
వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ కృష్ణారెడ్డి
బోధన్‌రూరల్ : మండలంలోని పెగడాపల్లి గ్రామంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వరద ముంపు నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అనంతరం పెగడాపల్లి సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు.
పాఠశాలపై ఎంఈవోకు ఫిర్యాదు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో అనుమతి లేకుండా ఆల్ఫోర్స్ స్కూ ల్ పేరుమీద కొనసాగుతున్న నరేంద్ర లిటిల్ నేషనల్ స్కూల్ పర్మిషన్‌ను రద్దు చేయాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ శుక్రవారం ఎంఈవో రాజ గంగారంకు వినతి పత్రం అందజేశారు. పాఠశాల భవనంపై ఆల్ఫోర్స్ స్కూల్ పేరు పెట్టుకుని విద్యార్థులను అయో మయానికి గురి చేస్తున్నారని ఎంఈవో దృష్టికి తీసుకు వచ్చారు.