
ఇందూరును గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతా
నిజామాబాద్ సిటీ: ఇందూరు నగరాన్ని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లాకేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్–1 మారుతినగర్ పార్కులో సోమవారం ఆయ న వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటా రు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభు త్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్క లు నాటే కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. జిల్లా లో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, లక్ష్య సాధనకు సమష్టిగా కృషిచేయాలన్నారు. పాఠశాల విద్యార్థులతో మొక్క లు నాటించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తా హెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ రాంభూపాల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్‌చార్జి డీఎఫ్‌వో నిఖిత, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఎఫ్‌వో సుధాకర్ పాల్గొన్నారు.
ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వండి
నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. ఈమేరకు వారు సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. షబ్బీర్ అలీ స్పందిస్తూ.. రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యమంలో జైలు పాలైనవారికి ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
క్రీడారంగానికి నిధులు కేటాయించాలి
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నాయకుడు సయ్యద్‌ఖైసర్ కోరారు. ఈమేరకు సోమవారం ఆయన జిల్లాకేంద్రానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, మైనార్టీ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.
మాలలకు రిజర్వేషన్లు పెంచాలి
నిజామాబాద్‌నాగారం: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2024 జనాభాల లెక్కల ప్రకారం మాలలకు రిజర్వేషన్లు పెంచాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు కోరారు. ఈమేరకు వారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి విన్నవించారు. జిల్లా హెడ్ క్వార్టర్‌లో మాల కల్యాణ మండపానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. నాయకులు ఆనంపల్లి ఎల్లయ్య, నాంది వినయ్ కుమార్, రాజన్న, సంగం శ్రీనివాస్, అసది గంగాధర్, చంద్ర కాంత్, భూమయ్య, బొడ్డు లక్ష్మణ్, భూషణ్, సాయిలు, బాల స్వామి, రామ చందర్, సక్కి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసమే
వన మహోత్సవం
ప్రభుత్వ సలహాదారు
మహమ్మద్ షబ్బీర్ అలీ