
ధర్పల్లిలో పందుల స్వైర విహారం
ధర్పల్లి: మండల కేంద్రంలో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందులను ఊరికి దూరంగా పెంచుకోవాలని నిబంధన ఉన్నప్పటికీ పెంపకం దారులు వాటిని గ్రామంలోనే పెంచుతున్నారు. మండల కేంద్రంలోని హోట ల్స్, ఫాస్ట్ ఫుడ్, చికెన్ సెంటర్లు ఎక్కువగా ఉండడంతో వారు వ్యర్థాలను సమీపంలోని ఊర చెరువు కట్టపై పడేస్తున్నారు. పందులు వ్యర్థాల కోసం గ్రామంలో సంచరిస్తున్నాయి. వర్షాకా లం కావడంతో ఎలాంటి వ్యాధులు వస్తాయో నని ధర్పల్లి వాసులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.