
నాగ పంచమికి ముస్తాబైన ఆలయాలు
నిజామాబాద్ రూరల్: నాగ పంచమి సందర్భంగా నగరంలోని నాగేంద్రుడి ఆలయాలు విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబయ్యాయి. నేడు శ్రావణ శుద్ధ నాగపంచమి కావడంతో భక్తులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భఃగా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
ఎంతో ప్రత్యేకత..
నాగపంచమి పండుగ రోజున మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి పుట్ట వద్ద పూజలు చేసి పాముల కోసం అవుపాలు పోయడం ఆనవాయితీగా వస్తోంది. నాగదేవతలకు పూజలు చేయ డం ద్వారా సంతాన ప్రాప్తి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. నాగుల పంచమిని పురస్కరించుకుని జొన్న పేలాలకు భలే గిరాకీ ఏర్పడింది. ప్రత్యేకంగా తయారు చేసిన జొన్న పేలాలను నాగదేవతకు నైవేద్యంగా పెడతారు. తెల్ల జొన్నలను పేలాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పేలాలు కేవలం నాగుల పంచమి పండుగ సంద ర్భంగా విక్రయస్తారు. తర్వాత రోజుల్లో ఇవి మచ్చు కై నా కనబడవు. వంశపారంవర్యంగా ఇళ్లలోనే నాగదేవతను పూజించడం కొందరికి సంప్రదాయంగా ఉంది. నాగ దేవతలను మట్టితో తయారు చేసి నాగ రూ పంలో ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించి, నాగ దేవతకు సారే సమర్పించుకుంటారు. అనంతరం సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి, పాలు పోసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆ పాలతో సోదరి, సోదరుడి కళ్లను కడుగుతారు. ఇలా కళ్లు కడగడం సోదర–సోదరీమణుల బంధానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. నాగుల పంచమి రోజున చేసే ఉపవానం సంవత్సరం పొడవునా వచ్చే నాగుల చవితి కంటే అధిక ఫలితం ఇస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఏదేమైనా నాగు ల పంచమి సందర్భంగా నాగదేవత పూజలతో ఆలయాలు, పుట్టలు సందడిగా మారనున్నాయి.
నేడు నగరంలోని నాగేంద్రుడి
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నిర్వహించనున్న భక్తులు
ఆలయ కమిటీల ఆధ్వర్యంలో
ఏర్పాట్లు పూర్తి

నాగ పంచమికి ముస్తాబైన ఆలయాలు