
సంచార జాతులను కాపాడాలి
నిజామాబాద్ నాగారం: సంచార జాతులను కాపాడాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ లాల్ అన్నారు. నగరంలోని వినాయక్‌నగర్‌లోగల సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. సంచార జాతులకు అన్ని రకాల సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందజేయాలన్నారు. వారిలో చైతన్యం తీసుకువచ్చి మంచి విద్య, వైద్యం అందించాలని కోరారు. తెరవే కామారెడ్డి అధ్యక్షులు గఫూర్ శిక్షక్, శివలింగం, వేముల శేఖర్ లున్నారు.
శివాజీ బీడీ సెంటర్ మార్చొద్దు
నిజామాబాద్ సిటీ: చందూరులోని శివాజీ బీడీ సెంటర్‌ను కుర్నాపల్లికి మార్చాలన్న నిర్ణయాన్ని యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నూర్జహాన్ కోరారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలోని శివాజీ బీడీ కార్యాలయంలో వారు వినతిపత్రం అందజేశారు. చందూరుకు చెందిన మహిళ బీడీ ప్యాకర్స్ 14 సంవత్సరాలుగా పనులు చేస్తున్నారని తెలిపారు. వారి సర్వీసును దృష్టిలో పెట్టుకుని కుర్నాపల్లికి మార్చకుండా చందూరులోనే ఉంచాలని విజ్ఞప్తిచేశారు. బీడీ ప్యాకర్లు రేఖ, విజయ, ఉష, భారతి, అనిత, జ్యోతి, అభిజ్ఞ పాల్గొన్నారు.
రేపు సీపీఎం
జిల్లా విస్తృత స్థాయి సమావేశం
నిజామాబాద్ సిటీ: నగరంలో ఈనెల 30న సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు అన్నారు. సమావేశానికి కార్మికులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లాకేంద్రంలోని నాందేవ్‌వాడలోగల పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొంటారని, పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న కర్తవ్యాల్లో భాగంగా జిల్లాలోని నాయకత్వానికి, కార్యకర్తలకు అవగాహన క ల్పించనున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు టై, బెల్టుల వితరణ
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం ఎంఈవో శ్రీనివాస్ టై, బెల్టులను అందజేశారు. పాఠశాల విద్యార్థిని నిత్యశ్రీ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు సాంబార్ ఉమారాణి–నవీన్‌లు రూ.5వేల విలువగల టై, బెల్టులను వితరణ చేశారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలపై దృష్టిపెట్టాలి
సిరికొండ: మండలంలో మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్సై రామకృష్ణను కాంగ్రెస్ నాయకులు కోరారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సైని సోమవారం వారు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఎస్సైని శాలువాతో సన్మానించారు. చిన్నవాల్గోట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రొండ్ల గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ప్యాట్ల లింబాద్రి, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఆసిఫ్, జీవన్, దీప్‌చంద్‌రెడ్డి పాల్గొన్నారు.

సంచార జాతులను కాపాడాలి

సంచార జాతులను కాపాడాలి