
సంక్షిప్తం
ఆలయ చైర్మన్లకు సన్మానం
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండా బాలాజీ మందిర్ చైర్మన్‌గా ఎన్నికై న లవంగ ప్రమోద్, హమాల్‌వాడి సంతోషిమాత, సాయిబాబా మందిరం చైర్మన్‌గా ఎన్నికై న బోధకం గంగా కిషన్‌లను సోమవారం రావూజీ సంఘం కన్వీనర్ నరేష్‌కుమార్, సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హాస్టళ్లలో అడ్మిషన్లపై సమీక్ష
బోధన్: ఈవిద్యాసంవత్సరానికిగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశంపై సో మవారం తన చాంబర్‌లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బోధన్, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల ఎంపీడీవోలు, ఎంఈవోలు, హాస్టళ్ల వార్డెన్‌లు హాజరయ్యారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియను పాదర్శకంగా పూర్తి చే యాలని సబ్ కలెక్టర్ సూచించారు. వసతి గృహాల విద్యార్థుల భద్రతపైశ్రద్ధ్ద వహించాలని తెలిపారు.తమ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను వార్డెన్‌లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
వేల్పూర్: మండలంలోని రామన్నపేట్ గ్రామంలో సోమవారం బేల్దారి నవీన్‌కు రూ. 17500, గూండ్లకిషన్‌కు రూ. 17వేలు, చాకలి జలంకు రూ. 44 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. శోభన్‌రెడ్డి, మోహన్, ఎల్క శ్రీనివాస్, భూమేశ్వర్‌రెడ్డి, లింబాద్రి, తెడ్డు భూమేశ్వర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 12,13, 30, 31, 32, 33వ వార్డుల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ నిర్మాణాలను కమిటీ సభ్యులతో పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోలా వెంకటేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 5లక్షలతో సొంత ఇళ్లు నిర్మించుకోటానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేస్తుందన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 618 మందికి ఇళ్లు మంజూరు కాగా, అందులో సుమారు 50% కి పైగా లబ్ధిదారులు ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నాని పేర్కొన్నారు. నాయకులు తాటి హన్మాండ్లు, లోక రాజేశ్వర్, పులి గంగాధర్, మీసాల రవి, బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈత మొక్కలు నాటిన గీత కార్మికులు
వేల్పూర్: మండలంలోని పోచంపల్లి గ్రామంలో ఈత వనం కోసం గీతకార్మికులు సోమవారం ఈజీఎస్ తరపున అందజేసిన ఈత మొక్కలను వారి సొసైటీ స్థలంలో నాటారు. అర ఎకరం స్థలంలో సుమారు 870 ఈత మొక్కలు నాటారు. వీటిని పెంపుదల చేసుకొని ఉపాధి పొందుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు పోశగౌడ్, వెంకాగౌడ్, శ్రీనివాస్, ముత్తెన్న,రాజేశ్వర్ పాల్గొన్నారు.