
ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్లే కీలకం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, సంక్షేమ ఫలాలు పేదలకు చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర స చివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభా గాధిపతులతో కలిసి కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు కలెక్టర్లు, అధికారు లు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వాహణపై తనిఖీలు నిర్వహిస్తూ, వారంలో ఒకరోజు అక్కడే బస చేయాలని ఆదేశించారు. నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రేప టికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్ర యాణం చేశారని, ఈ సందర్భంగా 97 బస్సు డిపో లు, 321 బస్‌స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్ల నిర్వహణ తీరుపై పలు సూచనలు చేశారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు..
ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివి గా మొక్కలు నాటాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వీసీలో కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రుల స్పష్టీకరణ
పురోగతి సాధించాలి
నిజామాబాద్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ టీ వి నయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యా ధులు తదితర అంశాలపై మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలస త్వం వహిస్తున్న ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మున్సిపల్, గ్రామ పంచాయతీలలో లబ్ధిదారుల వివరాలను రెండ్రోజుల్లోగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వక లేఖలు తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు జాబితా రూపొందించాలని సూచించారు. వన మహోత్సవం నూటికి నూరు శాతం విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీ ప్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.