
అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దు
● డీఏవో గోవింద్
రుద్రూర్: అఽధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) ఎం. గోవింద్ హెచ్చరించారు. కోటగిరి, పోతంగల్ మండలాల్లో మంగళవారం ఎరువుల, పెస్టిసైడ్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఫర్టిలైజర్ స్టాక్, స్టాక్ రిజిష్టర్లు, బిల్ బుక్కులను పరిశీలించారు. ఎరువులతోపాటు ఇతర మందులను లింక్ చేసి విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు యూరియా తక్కువ మోతా దు వాడాలని, అవసరం మేరకు కాంప్లెక్స్ ఫర్టిలైజర్‌ను వాడుకోవాలని సూచించారు. సమస్యలుంటే స్థానిక వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఏవో వెంట కోటగిరి, పోతంగల్ వ్యవసాయాధికారులు టీ రాజు, బీ నిశిత, ఏఈవోలు ఉన్నారు.
ఆయకట్టుకు నీటిని వదలాలి
● ఎమ్మెల్యే వేముల డిమాండ్
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి, కాకతీయ కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టి బాల్కొండ నియోజకవర్గ ఆ యకట్టు రైతులను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చే శారు. మంగళవారం ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివా స్‌రావు గుప్తాతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ప్రసుత్తం వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాకతీయ కాలువ ద్వారా కొంత నీటిని వదిలితే కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ శివారులో గేట్లు దించి నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి నీటి విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు.
రుణాలకు పట్టాపాస్ పుస్తకాలు పెట్టుకోవద్దు
● బ్యాంకర్లకు కలెక్టర్ సూచన
నిజామాబాద్ అర్బన్: రైతులకు డిజిటల్ రి కార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చే యాలని అన్ని బ్యాంకులకు సూచించినట్లు కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణాల మంజూ రు కోసం బ్యాంకులు రైతుల పట్టాదార్ పా స్ పుస్తకాలను తమ వద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదని, పాస్‌బుక్ పేరిట రుణాల ను తిరస్కరించకూడదని పేర్కొన్నారు. భూ భారతి చట్టం–2025లోని సెక్షన్ 10(6), సెక్షన్ 10(7) ల ప్రకారం భూములపై రుణా లను మంజూరు చేసే సందర్భంలో భూ హక్కుల రికార్డులను ఉపయోగించి రుణాలను ప్రాసెస్ చేయాలన్నారు. ఆదేశాలను అత్యవసరంగా పరిగణిస్తూ వెంటనే అమలు చేయాలని బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దు