
కూల్చివేతలపై కమిషనర్ ఆగ్రహం
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని పాములబస్తీ వాసుల కోసం స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన పబ్లిక్ టాయ్‌లెట్ల కూల్చివేతపై మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం మున్సిపల్ ఈఈ మురళీఽ మోహన్‌రెడ్డి, డీఈ రషీద్, ఏసీపీ శ్రీనివాస్‌లతో కలిసి పాములబస్తీని సందర్శించారు. కూల్చివేసిన మరుగుదొడ్లపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరుగుదొడ్ల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవన అనుమతులపై ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. పాముల బస్తీవాసుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్ వాహనం అందుబాటులో ఉంచాలని సూచించారు.
● నివేదిక ఇవ్వాలని ఏసీపీకి ఆదేశం