ముడుపులిస్తేనే చెరువుల లీజు! | - | Sakshi
Sakshi News home page

ముడుపులిస్తేనే చెరువుల లీజు!

Jul 23 2025 1:30 PM | Updated on Jul 23 2025 1:30 PM

ముడుప

ముడుపులిస్తేనే చెరువుల లీజు!

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మత్స్యశాఖలో అవినీతి పెరిగిపోయింది. పనికో రేటు అన్నట్లుగా మారింది. మత్స్యకారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. మొన్న బైలా రిజిస్ట్రేషన్లలో వసూళ్లకు పాల్పడిన సంగతి రాష్ట్ర శాఖకు, గత కలెక్టర్‌ దృష్టికి వెళ్లిన విషయం మరచిపోకముందే చెరువుల లీజులో ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఏకంగా శాఖలోని ఉద్యోగులే దీనిపై చర్చించుకోవడం గమనార్హం. జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 1,037 ఉండగా, మత్స్య సహకార సంఘాలు 350 పైగా ఉన్నాయి. చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు సొసైటీల్లో సభ్యత్వం కలిగిన మత్స్యకారులకే అధికారం ఉంటుంది. అయితే చెరువులు, కుంటలు ప్రభుత్వానికి సంబంధించినవి కావడంతో చేపలు పట్టుకున్నందుకు గాను ప్రతి ఏడాది తాసీల్‌ (పన్ను) కట్టాల్సి ఉంటుంది. దీనిని మత్స్య శాఖ అధికారులు చెరువు లీజు అంటారు. ఏడాదికోసారి మత్స్యకార సొసైటీలు మత్స్యశాఖతో లీజు అగ్రిమెంట్‌ చేసుకునేందుకు డివిజన్‌ స్థాయిలో ఎఫ్‌డీవోల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా 2024 సెప్టెంబర్‌ నుంచి 2025 జూన్‌ వరకు చెరువులకు లీజు అగ్రిమెంట్‌ చేశారు. చెరువుల విస్తీర్ణం ప్రకారం పెద్ద చెరువైతే రూ.400, మధ్యస్థ చెరువైతే రూ.200, పూర్తిగా ఎండిపోయే చెరువైతే రూ.60 ఫీజును మీ సేవ కేంద్రాల్లోనే కట్టాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి లీజు ఫీజు కట్టినా కూడా ఎఫ్‌డీవోలకు ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు వాపోతున్నారు. ఒక్కో సొసైటీ నుంచి రూ.1,500 నుంచి రూ.2వేలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అడిగినంత ఇస్తేనే లీజు అగ్రిమెంట్‌ బాండ్‌పై సంతకాలు చేసి ఇస్తున్నారని, ఇది ఆనవాయితీగా మారిందని శాఖలోని కొందరు ఉద్యోగులే బహిరంగంగా చెప్తున్నారు. ఈ అదనపు వసూళ్లపై శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు వచ్చినా మందలించి వదిలేశారే తప్ప చర్యలు తీసుకోలేదు. దీంతో ఏడీపై విమర్శలు వస్తున్నాయి.

ఓ మత్స్యకార సొసైటీ సభ్యులు చెరువు లీజు అగ్రిమెంట్‌ చేసుకునేందుకు డివిజన్‌ ఎఫ్‌డీవో వద్దకు వెళ్లారు. మీ సేవ కేంద్రంలో చెల్లించిన ఫీజు చూపించారు. లీజు అగ్రిమెంట్‌ బాండ్‌ ఇచ్చినందుకు ఆనవాయితీగా సదరు ఎఫ్‌డీవోకు కొన్ని డబ్బులు ఇవ్వగా, ఇంత తక్కువ నేనేం చేసుకోవాలంటూ వారిపైనే విసిరేసినట్లు తెలిసింది. రూ.2 వేలకు తక్కువ తీసుకోనంటూ చెప్పడంతో అడిగినంత ఇచ్చి వచ్చారంటా! ప్రస్తుతం ఇదే విషయంపై శాఖలోని కొందరు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇలా ప్రతి ఎఫ్‌డీవో స్థాయిలో చెరువుల లీజుకు అదనపు వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి.

మత్స్యశాఖలో నిలువు దోపిడీ

ఎఫ్‌డీవోలపై ఆరోపణలు

మీ సేవలో ఫీజు చెల్లించినా, అధికారుల చేతులు తడపాల్సిందే

ఫిర్యాదులు వచ్చినా చర్యలు శూన్యం

మత్స్యకార సొసైటీల ఆవేదన

ముడుపులిస్తేనే చెరువుల లీజు! 1
1/1

ముడుపులిస్తేనే చెరువుల లీజు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement