
పీఈటీల సేవలు అభినందనీయం
నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని ప్రయివేట్ బడుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నా పీఈటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)లు క్రీడాకారుల అభివృద్ధికి కృషిచేస్తుండటం అభినందనీయమని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి(డీవైఎస్‌వో) పవన్ కుమార్ అన్నారు. డీవైఎస్‌వోగా పవన్ కుమార్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం నగరంలోని టీఎన్జీవోస్ భవనంలో జిల్లా ప్రయివేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా లో క్రీడల అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలని కోరారు. ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు నాగమణి, విద్యాసాగర్ రె డ్డి, మల్లేష్ గౌడ్, గోపిరెడ్డి, శ్రీనివాస్, కృష్ణంరాజు, పశాంత్, మురళి, మధుబాబు, నాగరాజు, నిఖిల్, వినోద్ తదితరుల పాల్గొన్నారు.
ప్రభంజన్‌కు ఘన నివాళి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం సామాజిక విప్లవకారుడు, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ పోరా ట యోధుడు ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ సంతాప సభలు నిర్వహించారు. తె యూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మాస్ కమ్యూనికేషన్ విభాగాలు వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రభంజన్ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పూ లమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, సోషల్ సైన్స్ డీన్ ఘంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభంజన్ కుమార్ అకాల మరణం బహుజనవాదానికి తీరని లోటని అన్నారు. మాస్ కమ్యూనికేషన్ విభాగంలో మూడు రో జులు సంతాపదినాలుగా ప్రకటించారు. టూ టా అధ్యక్షుడు పున్నయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్‌బాబు, ప్రొఫెసర్ కనక య్య, అధ్యాపకులు జమీల్ అహ్మద్, అడికె నాగరాజు, రమణాచారి, సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరి, రాంబాబు, కిరణ్మయి పాల్గొన్నారు.
నంగి దేవేందర్ రెడ్డికి పరామర్శ
నిజామాబాద్ సిటీ: వేల్పూరులో బీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కో–కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. గురువారం రాత్రి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అ నిల్ ఆస్పత్రికి వచ్చి దేవేందర్ రెడ్డిని పరామ ర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని అతడికి భరోసా కల్పించారు. దా డులు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, ఇ లాంటి ఘటనలు పునరావృతం అయితే కాంగ్రెస్ శ్రేణులు చేతులు ముడుచుకొని కూర్చోరన్న విషయం గుర్తుంచుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి సూచించారు.

పీఈటీల సేవలు అభినందనీయం

పీఈటీల సేవలు అభినందనీయం