
ఘనంగా బోనాల ఉత్సవం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో గురువారం తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘ నంగా జరిగాయి. మహిళలు, అధికారులు బోనాల తో పాత కలెక్టరేట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయా నికి ఊరేగింపుగా చేరుకొని, బోనాలు, సారే సమర్పించారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశా రు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో టీజీవో ఆధ్వ ర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. వేడుకల్లో అ ర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య బోనా లు ఎత్తుకొని పాల్గొన్నారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. టీజీవో ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ ఉన్నారు.

ఘనంగా బోనాల ఉత్సవం

ఘనంగా బోనాల ఉత్సవం