
ఆందోళన చెందొద్దు.. అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కాన్వొకేషన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు కలిగిన ఎన్నో దారులు కనిపిస్తాయన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వారి వారి శక్తి సామర్థ్యాలు, అభిరుచి మేరకు కొందరు పరిశోధకులుగా మరికొందరు పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా, ప్రజాసేవకులుగా, విద్యావేత్తలుగా ఉన్నతంగా స్థిరపడుతున్నారన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జీవితమనేది పందెం లాంటిది కాదని ఇది ఒక ప్రయాణం మాత్రమేనని వివరించారు. ప్రయాణానికి సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్ ఆధారపడుతుందన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.