
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
● తప్పిన ప్రాణాపాయం
ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు ప్రయాణిస్తున్న రెండు కార్లను వెనుక నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ముందు వెళ్తున్న రెండుకార్లు వరుసగా ఢీకొనడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, ప్రమాదానికి గురైన కారు తగలడంతో బైక్ పై ప్రయాణిస్తున్న కామారెడ్డి జిల్లా ఉత్తునూరు గ్రామానికి చెందిన దంపతులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వారిని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. కాగా, కోతుల గుంపు ఎదురు రావడంతో కార్లను ఆపగా వెనుకాల నుంచి లారీ ఢీకొన్నట్లు పేర్కొన్నారు.