
పోలీస్ ప్రజావాణికి 27 ఫిర్యాదులు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ సీపీ కార్యాలయంలో సోమవారం సీపీ పోతరాజు సాయిచైతన్య పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదిదారులు రాగా, 27 అర్జీలను స్వీకరించారు. అనంతరం సీపీ ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ఎస్సైలు, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు.