
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన పీసీసీ చీఫ్
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను శుక్రవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ సమ్మేళనం ఏర్పాట్లను ఆయన వారికి వివరించారు. పీసీసీ చీఫ్‌తోపాటు పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, గడ్కోల్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వారు మీనాక్షి నటరాజన్‌కు వివరించారు.
50వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాం
నిజామాబాద్‌నాగారం: దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 50 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం అందజేస్తామని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. నగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో శుక్రవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) 12వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ముస్తాల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేయగా వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, ప్రతినిధులు తోట రాజశేఖర్, రామకృష్ణ, ప్రణీష్, నర్సయ్య ఉన్నారు.

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన పీసీసీ చీఫ్