సహకార వ్యవస్థ ముఖ్యమైంది
డొంకేశ్వర్(ఆర్మూర్): సొసైటీలో సహకార సంఘాల వ్యవస్థ, పాత్ర ముఖ్యమైనదిగా మారిందని డీసీవో శ్రీనివాస్ రావు అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలోని సుభాష్‌నగర్ ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ భవనంలో సమావేశం నిర్వహించారు. డీసీవో ముఖ్య అతిథిగా హాజరై, సహకార చట్టం, పాలనపై సభ్యులకు అవగాహన కల్పించారు. సొసైటీ సభ్యులు శంకర్‌రెడ్డి, దత్తాత్రేయ, ప్రభాకర్‌రెడ్డి, జగత్‌రెడ్డి, కోటేశ్వర్ రావు పాల్గొన్నారు.
మండుటెండలోనూ
పచ్చగా పంటపొలాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యాప్తంగా వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. పంటను అమ్ముకుని రైతులంతా ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ డొంకేశ్వర్ మండలంలో గోదావరి శివారు ప్రాంతాల్లో కోతకు రాని పొలాలు ఇంకా ఉన్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గడంతో రైతులు ఇటీవల వరిసాగు చేశారు. మండు వేసవిలో కూడా పచ్చదనంతో పొలాలు కళకళలాడుతున్నాయి. పొట్టదశలో ఉన్న వరికి రైతులు కష్టపడి నీటిని అందిస్తున్నారు. మండుటెండల్లోనూ పచ్చని పొలాల ను చూసి స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
సహకార వ్యవస్థ ముఖ్యమైంది


