
ఔషధ గుణాల తాటిముంజ
ఔషధ గుణాలు కలిగి ఉన్న తాటిముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా గీత కార్మికుల కుటుంబాలకు చెందిన మహిళలు ముంజలు విక్రయిస్తున్నారు. డజన్ ముంజల ధర రూ.వంద పలుకుతోంది. తాటి కల్లు తరహాలోనే ముంజలకు సైతం ఔషధ గుణాలు ఉంటాయని మన పూర్వీకులతోపాటు వైద్యులు సైతం పేర్కొంటున్నారు. మానవ శరీరంలోని టాక్సిన్‌ను వదిలించుకోవడానికి తాటి ముంజలు సహాయ పడతాయని, శరీర సహజ ఉష్ణోగ్రత నిర్వహణకు సహాయపడుతాయంటున్నారు. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటి ముంజల నీటిని పట్టిస్తే దురద తగ్గి అవి త్వరగా మానిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో తాటి ముంజలతో శీతల పానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. – ఆర్మూర్
పుష్కలంగా విటమిన్లు, ఖనిజ లవణాలు
మూడు తాటి ముంజలు తింటే ఒక కొబ్బరి బొండం తాగినంత ఫలితం ఉంటుంది.లేత తాటి ముంజల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. వీటిలో విటమి న్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. తాటి
ముంజలు వేడిమి నుంచి సైతం రక్షణ కల్పిస్తాయి. 100 గ్రాముల ముంజల్లో 43 కేలరీలు ఉంటాయి.
– డాక్టర్ రమేశ్, డిప్యూటీ
డీఎంహెచ్‌వో, ఆర్మూర్

ఔషధ గుణాల తాటిముంజ

ఔషధ గుణాల తాటిముంజ