నెలాఖరు వరకు సెర్ప్‌ బదిలీలు | - | Sakshi
Sakshi News home page

నెలాఖరు వరకు సెర్ప్‌ బదిలీలు

May 6 2025 12:51 AM | Updated on May 6 2025 12:51 AM

నెలాఖ

నెలాఖరు వరకు సెర్ప్‌ బదిలీలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉద్యోగులందరికీ (వంద శాతం) బదిలీలు చేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు జీవో నం.250 జారీ చే యడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలో అన్ని కేడర్‌లు కలిపి మొ త్తం 215 మంది పని చేస్తున్నారు. ఇందులో ఏపీడీ, డీపీఎం, సీసీలు, అడ్మిన్‌ అసిస్టెంట్లు, అ టెండర్లు, డ్రైవర్లు ఉన్నారు. సెర్ప్‌లో బదిలీలు లేక దాదా పు పదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఉద్యోగు లు ఒకే ప్రాంతం, ఒకే సీటులో పని చేస్తున్నా రు. దీంతో కొంతమందికి అవినీతి చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాంతంపై పట్టు సాధించి ఎవరికీ చిక్కకుండా తెలివిగా అవినీతికి పాల్పడుతున్నారు. అలాంటి ఉద్యోగులకు తా ము విధులు నిర్వర్తిస్తున్ని ప్రాంతా న్ని వదిలి వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు. మరికొంత మందికి ఒకే చోట పని చేయడం, దూర ప్రాంతాల్లో విధులుకు వెళ్లి రావడం ఇబ్బందికరంగా మారింది. అలాంటి వారు బదిలీలు ఎప్పుడొస్తాయా అని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం..

జీవో జారీ

త్వరలో గైడ్‌లైన్స్‌ విడుదల

జిల్లాలో 215మంది ఉద్యోగులు

సీనియారిటీ జాబితా..

ఉద్యోగుల బదిలీలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సెర్ప్‌ రాష్ట్ర శాఖ భావిస్తోంది. ఇందుకు విధివిధానాలను కూడా రూ పొందించడంతోపాటు ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రెడీ చేస్తోంది. నూరుశాతం బదిలీలు చేపట్టనుండడంతో ఉద్యోగులంద రూ బదిలీ కానున్నారు. ఏపీడీ, డీపీఎంలకు రాష్ట్ర స్థాయిలో, ఏపీఎంలకు జోనల్‌ స్థాయి లో, సీసీలు, ఇతర సిబ్బందికి జిల్లా స్థాయిలో బదిలీలు చేయనున్నారు. అయితే బదిలీలను ఏ విధంగా చేయాలనేదానిపై సెర్ప్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఏ విధంగా చేస్తారనే దానిపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బదిలీల నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులకు కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యేందుకు ఇప్పటి నుంచే పైరవీలు మొదలుపెట్టారు. ఉద్యోగ సంఘ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

గైడ్‌లైన్స్‌ రావాలి

సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. వారంలో గైడ్‌లైన్స్‌ వచ్చే అవకాశాలున్నాయి. గైడ్‌లైన్స్‌ ప్రకారం నెలాఖరు నాటికి బదిలీలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. బదిలీలు పారదర్శకంగా జరుగుతాయి.

– సాయాగౌడ్‌, డీఆర్‌డీవో

నెలాఖరు వరకు సెర్ప్‌ బదిలీలు 1
1/1

నెలాఖరు వరకు సెర్ప్‌ బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement