
రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం
నిజామాబాద్‌అర్బన్: సీఎం రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అని, తెలంగాణ బద్ధవ్యతిరేకి అయిన చంద్రబాబుకు శిష్యుడని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై దృష్టి లేదని, తన కుటుంబం బాగుకోసమే పాటుపడుతున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను చూసి రేవంత్‌రెడ్డి మైండ్‌బ్లాక్ అయిందన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. టీడీపీని తెలంగాణలో సమాధి చేసిన నీవు కాంగ్రెస్‌ను కూడా సమాధి చేసేపనిలో ఉన్నావని పేర్కొన్నారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలపడమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, రాంకిషన్ రావు, సత్య ప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, పూజ నరేందర్, పోల సుధాకర్, సుంకరి రవి, రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ శంకర్, వెల్మల్ రాజన్న, మోహన్, రజనీష్, ఫయీం ఖురేషి, శేఖర్ రాజా, మహేశ్, నవీన్, సూర్య, సురేశ్ సన్నీ, రవి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శ