
డిచ్‌పల్లి ఎంపీడీవోగా బూక్య లింగం నాయక్
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి ఎంపీడీవోగా బూక్య లింగం నాయక్ శుక్రవారం బా ధ్యతలు స్వీకరించారు. వే ల్పూర్ మండల పరిష త్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న లింగం నాయక్ డిచ్‌పల్లి ఎంపీడీవోగా నియామకమయ్యారు. ఇన్‌చార్జి ఎంపీడీవోగా పని చేసిన సూపరింటెండెంట్ నివేదిత డిప్యుటేషన్‌పై వే ల్పూర్ మండల సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. పలువురు అభినందనలు తెలిపారు.
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో సైబర్ నేరగాళ్ల వలలో 32 మంది చిక్కుకున్నారని, అప్రమత్తం గా ఉండాలని కౌ న్సిలర్ డి శ్రీనివాస్, జ్యోత్స్న సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్ దేవిదాస్, బైరాపూర్ కారోబార్ వేణు, సాయన్న, సంతోష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సామాజిక రుగ్మతలను
నివారించాలి
నిజామాబాద్ రూరల్: కవులు తమ రచనల ద్వారా సామాజిక రుగ్మతలను నిర్మూలించాల ని సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షులు ప్రేమ్‌లాల్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని వినాయక్‌నగర్ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కవి తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. సమావేశంలో వేముల శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఐవోసీఎల్ ప్రతినిధులకు
భగవద్గీత అందజేత
సుభాష్‌నగర్: నగరంలో ఐవోసీఎల్ కంపెనీ ప్ర తినిధులకు మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మంచాల జ్ఞానేందర్ భగవద్గీత, వారాహిమాత చిత్ర పటాన్ని శుక్రవారం అందజేశారు. ఐవోసీఎల్ కంపెనీ ప్రతినిధులు అనిల్ కుమార్, పీయూష్ మిట్టల్, ముక్కారం, పూర్ణ చందర్, డీలర్స్ పాల్గొన్నారు.
నోట్ బుక్స్ ఆవిష్కరణ
ఖలీల్ వాడి: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ పి.సాయి చైతన్యని ఎ మ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ చేతుల మీదుగా నోట్ బుక్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పిల్లలకి ఉపయోగపడే విధంగా పుస్తకాల పంపిణీ నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు మల్ల మారి సుధాకర్, తదితరులున్నారు.
28 నుంచి ఉచిత యోగా
సంస్కార శిక్షణ శిబిరం
నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్‌నగర్‌లో గల దయానంద యోగ కేంద్రం ఈ నెల 28 నుంచి బాల బాలికలకు వేసవి కాల ఉచిత యోగ సంస్కార శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు యోగాచార్యులు రాంచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9 నుండి 15 ఏళ్ల బాలబాలికలు రావచ్చన్నారు. పురుషులకు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, మహిళలకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9849845550, 9398504054 నెంబర్లను సంప్రదించాలన్నారు.
మోడల్ స్కూల్‌లో అడ్మిషన్‌కు రేపు ప్రవేశ పరీక్ష
రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులో గల మోడల్ స్కూల్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 27న ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ టి. చెన్నప్ప తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 94922 07033కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు.

డిచ్‌పల్లి ఎంపీడీవోగా బూక్య లింగం నాయక్

డిచ్‌పల్లి ఎంపీడీవోగా బూక్య లింగం నాయక్

డిచ్‌పల్లి ఎంపీడీవోగా బూక్య లింగం నాయక్