
‘కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తిప్పికొడతాం’
నిజామాబాద్ సిటీ: పని గంటల పెంపుదలను నిరసిస్తూ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తిప్పికొట్టా లని టీయూసీఐ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్‌ఆర్‌భవన్‌లో 139వ మేడే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్ర ధాన కార్యదర్శి ముష్క సుధాకర్ మాట్లాడుతూ.. దేశంలో 40 కోట్ల మంది శ్రమజీవులకు సరిపడా వేతనాలు, జీవన భద్రత లేవన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ, మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా ఆమోదించి, అమలు చేయాలని చూడడం వల్ల కా ర్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. నాయకులు వెంకన్న, కిషన్, సాయన్న, రవి, సాయిబాబా, తదితరులున్నారు.