
పాఠశాలకు క్రీడా సామగ్రి వితరణ
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా సామగ్రిని దాతలు వేంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఉత్కం శ్రీనివాస్‌గౌడ్ వితరణగా అందజేశారు. క్రీడా పరికరాలను హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈవో శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని దాతలు తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణ్‌పల్లి సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, వెల్మ గంగారెడ్డి, కనక రవి, గంగారెడ్డి, రాజేశ్‌గౌడ్, రాజేశ్‌ఖన్నా, సన్‌యాదవ్, ప్రసాద్, రణదీర్‌గౌడ్, మర్కంటి గంగామోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.