
వీడీసీల కార్యకలాపాలను అణిచివేస్తాం
ఖలీల్‌వాడి: గ్రామాల అభివృద్ధి అంశాలను పక్కనపెట్టి సివిల్ వివాదాలు, భూ తగదాలు తదితర పంచాయితీలు చేసే వీడీసీలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చట్టాన్ని వీడీసీలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయని, బా ధితులు పోలీస్‌స్టేషన్, న్యాయస్థానాన్ని ఆశ్రయించొద్దని, తాము చెప్పిన విధంగా వినాలని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో బెల్ట్‌షాపులు, కోడిగుడ్లు, కూల్ డ్రింక్స్ తదితర అమ్మకాలకు వేలం నిర్వహించడం చట్టరీత్య నేరమని తె లిపారు. ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుంచి సహాయసహకారాలు తీసుకోవాలని, తాము చెప్పే వి శాసనమని, చట్టామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే తగు చర్యలు తీసుకుంటామని వీడీసీలను సీపీ హెచ్చరించారు. వీడీసీలు ఇబ్బందులకు గురి చేస్తే దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
గ్రామాల్లో పంచాయితీలు చేస్తే
చర్యలు తప్పవు
పోలీస్ కమిషనర్ పోతరాజు
సాయిచైతన్య హెచ్చరిక