
హాస్టళ్లలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని వసతిగృహాలు, కళాశాలల్లో పోలీసు డాగ్‌స్క్వాడ్ బృందాలు, స్పెషల్ టీములు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసు సిబ్బంది విద్యార్థులకు, యువకులకు డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
11న అర్సపల్లిలో
టేకు చెట్ల వేలం
డొంకేశ్వర్(ఆర్మూర్): నగరంలోని అర్సపల్లి మత్స్య శాఖకు చెందిన ప్రాంగణంలో మార్క్ చేసిన పన్నెండు టేకు చెట్లను ఈ నెల 11న ఉదయం 10గంటలకు వేలం వేయనున్నట్లు మత్స్య శాఖ అధికారి ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో అటవీ శాఖ అధికారులు నిర్ణయించిన ధరకు వేలం వేస్తామని పేర్కొన్నా రు. ఆసక్తిగలవారు రూ.5వేలు చెల్లించి వేలంలో పాల్గొనాలని, వేలంలో చెట్లను దక్కించుకున్నవారు అటవీ అధికారులతో పర్మిట్‌తో దుంగలను తీసుకెళ్లాలని సూచించారు. వేలంలో పాల్గొనేందుకు చెల్లించిన రూ.5వేలు తిరిగి ఇవ్వబడవని స్పష్టం చేశారు.