
చెత్త వాహనాల అడ్డగింత
నిజామాబాద్ సిటీ: డంపింగ్ యార్డుకు చెత్తను తరలిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలను నగర శివారులోని నాగారం వద్ద స్థానికులు అడ్డుకున్నారు. 300, 80 క్వార్టర్స్ వాసులు వాహనాలకు అడ్డుగా నిలిచి ఆందోళన చేశారు. డంపింగ్‌యార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రభుదాస్ స్థానికులను సముదాయించినా వినలేదు. చివరికి మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ వచ్చి స్థానికులతో మాట్లాడారు. డంపింగ్ యార్డులో తరచూ నిప్పంటుకోవడంతో పొగ ఇళ్లలోకి వ్యాపిస్తోందని స్థానికులు తెలిపారు. కళ్ల మంటతోపాటు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని తెలుపగా, డంపింగ్ యార్డు నుంచి పొగ రాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్ అలీ, ఏఎంసీ జయకుమార్ ఉన్నారు.
డంపింగ్‌యార్డు వద్ద స్థానికుల ఆందోళన