స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి

Apr 7 2025 10:18 AM | Updated on Apr 7 2025 10:18 AM

స్వీప

స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి

నిజామాబాద్‌ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి వారికి ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఓమయ్య, అధ్యక్షుడిగా టి చక్రపాణి, ఉపాధ్యక్షులుగా రాధా, స్రవంతి, ప్రధాన కార్యదర్శిగా వసంత, కార్యదర్శిగా సోఫియా, ఉదయ ఎన్నికయ్యారు. సమావేశంలో కార్మికులు, సభ్యులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీతో

ప్రజల్లో సంతోషం

నిజామాబాద్‌ సిటీ: పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను తెలంగాణ ఎరుకల గిరిజన కుల పోరాట సాధన సమితి నాయకుడు కోనేరు సాయికుమార్‌ కలిశారు. ఆదివారం జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమాన్ని నగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మైనారిటీ నాయకుల పాదయాత్ర

నిజామాబాద్‌ సిటీ: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మైనారిటీ నాయకులు ఆదివారం నిర్వహించారు. నగరంలోని 46, 47, 48 డివిజన్లలో పాదయాత్రలు చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులను, కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను స్థానికులకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్‌ఖైసర్‌, అక్బర్‌ హుస్సేన్‌, ఆయూబ్‌ ఖురేషీ, సాబేర్‌ అలీ, మహ్మద్‌ ఇసా, రాంచందర్‌ గైక్వాడ్‌, దత్తు పాల్గొన్నారు.

బీటీ రణదీవే స్ఫూర్తితో ఉద్యమాలు

నిజామాబాద్‌ సిటీ: అఖిల భారత కార్మిక ఉద్యమ నేత బీటీ రణదీవే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధనకు ఉద్యమాలు సిద్ధం కావాలని సీఐటీయూ నాయకులు రమేశ్‌బాబు, నూర్జహాన్‌ అన్నారు. బీటీ రణదీవే వర్ధంతిని నగరంలోని సీటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్మికుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ికటారి రాములు, రాములు, ఇమామ్‌, కేద్రమ్మ, సురేశ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

హిమోఫీలియా వ్యాధిపై అవగాహన

నిజామాబాద్‌నాగారం: హిమోిఫీలియా వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెడ్‌క్రాస్‌ జిల్లా మాజీ చైర్మన్‌ నీలీ రాంచందర్‌ అన్నారు. ఆదివారం నగరంలోని మారుతినగర్‌లో ఉన్న స్నేహ సొసైటీలో హిమోిఫీలియా సొసైటీ ఆధ్వర్యంలో వ్యాధితో బాధపడుతున్న వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం హిమోఫిలియా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం వైద్యుడు విజయానందరా వు హిమోఫిలియాపై రాసిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధ య్య, కరుణాకర్‌, రామకృష్ణ, మహమ్మద్‌ ఎజాజ్‌, గంగారాం, అంబరీష్‌ పాల్గొన్నారు.

ఆకుల కొండూర్‌లో

ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని ఆకుల కొండూర్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఆదివారం శ్రమదానం చేశారు. రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలు, గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనంలో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఎండిన ఆకులను తొలగించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ వెంకటరమణ, వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

స్వీపర్లు, స్కావెంజర్లను  కార్మికులుగా గుర్తించాలి  
1
1/4

స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి

స్వీపర్లు, స్కావెంజర్లను  కార్మికులుగా గుర్తించాలి  
2
2/4

స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి

స్వీపర్లు, స్కావెంజర్లను  కార్మికులుగా గుర్తించాలి  
3
3/4

స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి

స్వీపర్లు, స్కావెంజర్లను  కార్మికులుగా గుర్తించాలి  
4
4/4

స్వీపర్లు, స్కావెంజర్లను కార్మికులుగా గుర్తించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement