
రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి
బాల్కొండ: కోందడ రాముని ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండలం పోచంపాడ్‌లోని కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే సతీసమేతంగా పాల్గొని పట్టువ స్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు.