వేడుక చూద్దాం | - | Sakshi
Sakshi News home page

వేడుక చూద్దాం

Apr 6 2025 1:08 AM | Updated on Apr 6 2025 1:08 AM

వేడుక

వేడుక చూద్దాం

రారండోయ్‌..
ఇందూరు రఘునాథుడు

విద్యుత్‌ దీపాల వెలుగులో సుభాష్‌నగర్‌ రామాలయం

సత్యం, దయ, ప్రేమ, ధర్మం మూర్తీభవించిన శ్రీరాముడి జన్మదిన వేడుకలకు జిల్లా ముస్తాబైంది. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయం, బడా రాంమఠం, సుభాష్‌నగర్‌ రామాలయం, ఖిల్లా డిచ్‌పల్లి, శక్కర్‌నగర్‌ కోదండరామాలయం, ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట, అంకాపూర్‌, కందకుర్తి, తాడ్‌బిలోలి రామాలయాలు నవమి వేడుకలకు ముస్తాబయ్యాయి. లక్షలాది మంది భక్తులు రాములోరిని దర్శించుకుని కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. సుభాష్‌నగర్‌లోని రామాలయంలో సీతమ్మవారికి ఓ భక్తుడు బంగారు పట్టుచీర కానుకగా అందించగా, అంకాపూర్‌లో ప్రత్యేక రథాన్ని తయారు చేయించారు. ఇలా ఎక్కడ చూసినా శ్రీరామనవమి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. – నిజామాబాద్‌ రూరల్‌

సుభాష్‌నగర్‌ రామాలయంలో దేవతామూర్తులు

నేడు శ్రీరామనవమి సుగుణాభిరాముడి కల్యాణానికి ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నాలుగు దశాబ్దాల చరిత్రి ఉన్న ఇందూరు నగరంలోని సుభాష్‌నగర్‌ రామాలయానికి ఓ భక్తుడు అపురూపమైన కాను క ఇచ్చారు. నగరానికి చెందిన జ్యూయెలరీ షాపు యజమాని మనోహర్‌ దంపతులు రామలక్ష్మ ణులకు, హనుమంతులవారికి పట్టు వస్త్రాలు బ హూకరించడంతోపాటు సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను బహూకరించారు. అత్యంత నాణ్యమైన పట్టుతోపాటు 7 గ్రాముల బంగారం కలిపి ఈ చీరను తయారు చేశారు. దేశంలోనే ప్రఖ్యాతి కలిగిన సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేత కళా కారుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రధాని మో దీతో ప్రశంసలు పొందిన హరిప్రసాద్‌ ఈ చీరను తయారు చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీర, దబ్బణంలో దూరే చీర వంటివి అనేకం తయారు చేసిన హరిప్రసాద్‌.. భారతదేశం, అశోకచక్రం, జాతీయగీతం, జీ20 సదస్సు ప్రత్యేకతలను తెలుపుతూ చీరలను తయారు చేశారు. అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు, భద్రాచలం సీత్మమ్మవారికి పట్టు చీర అందించిన హరిప్రసాద్‌తో ఈ చీరను తయారు చేయించారు. శనివారం బంగారు పట్టు చీరను ఆలయ కమిటీకి మనోహర్‌ దంపతులు అందజేశారు. సీతారాముల కల్యా ణోత్సవంలో ఈ చీర తో సీతమ్మను అలంకరించనున్నారు. ఆలయ 40వ వార్షిక బ్రహ్మోత్సవాలను, సీతారాముల క ల్యాణాన్ని పురస్కరించుకుని ఇంత అపురూపమై న కానుక అందించడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ సరళామహేందర్‌రెడ్డి అన్నారు.

దాతల సహకారంతో కచ్చితమైన విధానంలో సుభాష్‌నగర్‌ రామాలయంలో క్రతువులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమ క్రతువులు నిర్వహించనున్నారు. 1986 ఏప్రిల్‌ 14వ తేదీన ఆలయ ప్రతిష్ఠ జరిగింది. 40వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో ప్లాస్టిక్‌ రహితంగా అన్ని కార్యక్రమాలు చేసేందుకు స్టీల్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దాతలు స్టీల్‌ వస్తువులు సమకూరుస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: శ్రీరాముడు, హనుమంతుడి భక్తుడైన సమర్థ రామదాసు 17వ శతా బ్దంలో నిర్మింపజేసిన ఆలయాలు ఇందూరు జిల్లా ఘనమైన చరిత్రను ఠీవిగా నిలబెడుతున్నాయి. మహారాష్ట్ర పక్కనే ఉండడంతో ఇందూరు జిల్లాలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ప్ర భావం ఎక్కువగా ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసుచే నిర్మితమైన పెద్దరామమందిర్‌, విస్తరించబడిన రఘునాథ ఆలయం గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ ఆలయాలకు, డిచ్‌పల్లిలోని రామాలయానికి అనుసంధానంగా భూగర్భంలో సొరంగ మార్గాలు ఉన్న ట్లు రఘునాఽథ ఆలయ గోడలపై సూచికలు ఉన్నాయి.

రఘునాఽథ ఆలయాన్ని గుట్టపై 914–928 సంవత్సరాల మధ్య రాష్ట్రకూట రాజవంశానికి చెందిన ఇంద్రుడు అనే రాజు 3,900 గజాల కోటను నిర్మించాడు. అదేవిధంగా ఇక్కడ 53 అడుగుల ఎల్తైన అఖండ శిలాఽధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిపై గరుడదీపం వెలిగిస్తే చుట్టుపక్కల ఊర్ల ప్రజలు దీపాలు వెలిగించుకునేవారు. కాగా రఘునాథుడనే మహర్షి ఖిల్లాలోని ప్రత్యేక సొరంగ మార్గం గుండా బొడ్డెమ్మ చెరువుకు వెళ్లి స్నానం చేసి వచ్చేవారని చరిత్ర చెబుతోంది. తరువాత 17వ శతాబ్థంలో సమర్థ రామదాసు శ్రీరాముడి ఆలయాన్ని నిర్మింపజేశారు. అదేవిధంగా ఇక్కడ ధాన్యమందిరం నిర్మించారు. ఇందులో సమర్థ రామదాసుతో పాటు ఛత్రపతి శివాజీ సైతం ధాన్యం చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

నగరం నడిబొడ్డున ఉన్న పెద్ద రామమందిర్‌ను 17వ శతాబ్థంలో సమర్థ రామదాసు నిర్మింపజేశారు. ఇక్కడ శ్రీరాముడు, హనుమాన్‌ మంది రాలు ఎదురెదురుగా ఉంటాయి. శ్రీరాముడి విగ్ర హం పాదాల నుంచి సమాంతరంగా హనుమంతు డి తలభాగం ఉండేలా నిర్మాణం చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రాంగణంలో ఉన్న కోనేరు ఆకట్టుకుంటుంది. ఇందులో గోశాల చక్కగా నిర్వహిస్తున్నారు. ‘బడా రామ్‌ మఠం్‌’ ఆధ్వర్యంలో ఈ ఆల యం నిర్వహిస్తున్నారు. మఠాఽధిపతులుగా 1632 నుంచి ఉద్ధవ్‌ స్వామి, 1656 నుంచి మాధవ్‌ స్వా మి, 1687 నుంచి గోవింద్‌ స్వామి, 1725 నుంచి అ నంత్‌ స్వామి, 1739 నుంచి నృసింహ స్వామి, 1754 నుంచి రామకృష్ణ స్వామి, 1778 నుంచి రా మచంద్ర స్వామి, 1804 నుంచి జయరామ్‌ స్వామి, 1834 నుంచి ఆత్మారాం స్వామి, 1848 నుంచి వామన్‌ స్వామి, 1853 నుంచి రాజారాం స్వామి, 1866 నుంచి కేశవ్‌ స్వామి, 1904 నుంచి కల్యాణ్‌ స్వామి, 1905 నుంచి దినకర్‌ స్వామి 1983 నుంచి యశోజీ స్వామి మఠాధిపతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించారు.

సమర్థ రామదాసు నిర్మించిన

ఆలయాల్లో కొలువుదీరిన

కోదండరాముడు

ఠీవిగా వెలుగుతున్న ఆలయాలు

నాటి చారిత్రక వైభవాన్ని సజీవంగా

నిలబెట్టిన పెద్దరామమందిర్‌,

రఘునాథ ఆలయాలు

జిల్లాపై ఛత్రపతి శివాజీ గురువైన

సమర్థ రామదాసు ముద్ర

వేడుక చూద్దాం 1
1/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 2
2/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 3
3/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 4
4/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 5
5/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 6
6/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 7
7/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 8
8/9

వేడుక చూద్దాం

వేడుక చూద్దాం 9
9/9

వేడుక చూద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement