● ఎస్‌ఈ రవీందర్
నిజామాబాద్ సిటీ: రైతులు దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ సర్వీస్ కనెక్షన్‌లు మంజూరు చేస్తామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,86,571 కనెక్షన్లు ఉండగా, 2024–25 సంవత్సరానికిగాను 3,597 కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కొ త్త సర్వీసులకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో మంజూరు వేగవంతం కానున్నదని, కనెక్షన్‌ల కోసం రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానంతో పనులు జాప్యం లేకుండా జరుగుతాయని పేర్కొన్నారు.
155 రకాల వంగడాల ప్రదర్శన
డొంకేశ్వర్(ఆర్మూర్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఇండియా ఫార్మ ర్స్ 68వ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది రైతులు సమావేశానికి హాజరుకాగా, రాష్ట్రం నుంచి ఐదుగురు పా ల్గొన్నారు. వారిలో జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శరైతు నాగుల చిన్నగంగారాం (చిన్ని కృష్ణుడు) ఉన్నారు. తను సొంతగా అభివృద్ధి చేసిన 155 రకాల దేశీ వరి వంగడాలను చిన్నకృష్ణుడు ప్రదర్శనకు ఉంచారు. సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల రైతులు వరి విత్తనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం చిన్నికృష్ణుడు ప్రకృతి వ్యవసాయంపై సమావేశంలో ప్రసంగించారు.
కొనసాగుతున్న
పది పరీక్షలు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించగా, 22,735 మంది విద్యార్థులకుగాను 22,679 మంది హాజరయ్యారు. 56 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.