నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన ర్యాలీని జీజీహెచ్ ఆవరణలో అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రా రంభించారు. బస్టాండ్ మీదుగా న్యూ అంబేడ్కర్ భవన్‌కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కిరణ్‌కుమార్ మా ట్లాడుతూ.. వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి క్షయను నివారించాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, నివారణ చర్యలు సకాలంలో చేప ట్టి కొత్తగా క్షయ వ్యాధిగ్రస్తులు నమోదు కాకుండా చూ డాలన్నారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ.. క్షయ నివారణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధి నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. టీబీ రోగులు పూర్తికాలం చికిత్స తీసుకోవాలని సూచించారు. చికిత్స తీసుకున్నంత కాలం పౌష్టకాహారం కోసం రోగి ఖాతాలో ప్రతి నెలా వెయ్యి రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ దేవీనాగేశ్వరి, డీఐవో అశోక్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డివిజన్ చైర్మన్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీశైలం, పల్మనాలజీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ ఉమర్, టీబీ మెడికల్ ఆఫీసర్ అవంతి, రాజేందర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ఘనపూర్ వెంకటేశ్వర్లు, టీబీ కోఆర్డినేటర్ రవి, ఆకాశవాణి కో ఆర్డినేటర్ మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అంకితభావంతో
పని చేయాలి
అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ